కూసుమంచి: రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఖాళీ యూరియా బస్తాలతో సీపీఎం నిరసన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో దోబూచులాడటం మానేసి యూరియా కొరతను అధిగమించి సకాలంలో ప్రతి రైతుకు సరిపడా యూరియా అందివ్వాలని సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ డిమాండ్ చేశారు.కూసుమంచి మండల కేంద్రంలో ఖాళీ యూరియా బస్తాలతో నిరసన చేపట్టారు.