ఉరవకొండ: మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసమే స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్
మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ప్రోగ్రాం జిల్లా అధికారి నారాయణస్వామి పేర్కొన్నారు. బుధవారం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని రాకెట్ల మరియు కౌకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు పావని వెంకటేష్ నాయక్ లక్ష్మీ చందన, ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి తదితరులతో కలిసి మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబం లక్ష్యమని పేర్కొన్నారు.