అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణ ప్రెస్ క్లబ్ శుక్రవారం గిరిజన ప్రజా చైతన్య పోస్టర్లను గిరిజన సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిపిఎస్ జాతి అధ్యక్షులు ఒడిత్య శంకర్ నాయక్, మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు.. గిరిజనులకు కూడు కూడా నీడ లేక పరితపిస్తున్నారని ఇప్పటికే రేషన్ కార్డు ఆధార్ కార్డు లేక దుర్భరమైన జీవితాలను జీవిస్తున్నారు అన్నారు . ఆధార్ కార్డు లేని గిరిజనులు ప్రభుత్వ సంక్షేమ ఫలాలకు దూరంఅవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.