తాడ్వాయి: తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన ఎమ్మార్పీఎస్ : ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాగయ్య
తాడ్వాయి మండలంలోని సోమవారం 12 గంటల సమయంలో తహసిల్దార్ కార్యాలయాన్ని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ముట్టడించారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు పెంచాలని వారు డిమాండ్ చేశారు. వికలాంగులకు రూ. 6000, వితంతువులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు రూ. 4000 పెన్షన్ ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాగయ్య కోరారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడుస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు.