ఆళ్లగడ్డ: అమెరికాలో యువకుడు ఆత్మహత్య : స్వగ్రామం వీరారెడ్డి పల్లె కు భౌతిక కాయం
ఉద్యోగం రాలేదన్న బెంగతో నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం వీరారెడ్డి పల్లె కు చెందిన ఇరగన బోయిన చందు అనే యువకుడు అమెరికాలో ఆత్మహత్య పాల్పడిన యువకుడి భౌతిక కాయ మంగళవారం స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు, ఏఆర్ కానిస్టేబుల్ కుమారుడైన చందు ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లి పిస్టల్ తో కాల్చుకొని చనిపోవడం బాధాకరమంటూ కన్నీటి పర్యటమయ్యారు, గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి, టిడిపి యువ నాయకులు భూమా జగత్ విఖ్యాత రెడ్డి, పలువురు ప్రముఖులు చందు భౌతిక కాయానికి పూలమాలతో నివాళులర్పించారు.