ఆళ్లగడ్డ: ఎగువ దిగువ అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది, దూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు, ఎగువ, దిగువ ఆలయాలతో పాటు నల్లమల అడవి ప్రాంతంలోని పావన నరసింహ స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు, తలనీలాలు కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు, భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో స్వామి దర్శనానికి గంట సమయం పట్టింది