కొత్తగూడెం: పురుగుల మందు తాగి మృతి చెందిన ఘటనపై మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పాల్వంచ రూరల్ పోలీసులు
పాల్వంచ మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన ప్రసాద్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.. గత కొద్దిరోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాడు.ఎన్ని ఆసుపత్రులకు తిరిగిన తగ్గకపోవడంతో మనస్తాపంతో 9వ తారీఖున పొలం దగ్గర ఉన్న పురుగులు మందు తాగాడు.గమనించిన కుటుంబీకులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,మెరు గైన వైద్యం నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాల్వంచ రూరల్ ఎస్సై సురేష్ తెలిపారు..