పలమనేరు: ఒంటరి ఏనుగు దాడిలో గాయపడిన FSO మరియు ట్రాకర్ కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటాం - DCF చైతన్య కుమార్ రెడ్డి
రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చలపతిరావు ఆదేశాల మేరకు, పలమనేరులో ఒంటరి ఏనుగు ప్రవేశించి బీభత్సం సృష్టిస్తుండగా దాన్ని అడ్డుకొని తిరిగి అడవిలోకి పంపడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు చెందిన ఎఫ్.ఎస్.ఓ సుకుమార్ మరియు ట్రాకర్ హరి వెళ్ళినప్పుడు వారిపై ఆ ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ ఫైనాన్షియల్ గా వైద్య పరంగా అన్ని రకాలుగా ఆదుకునేందుకు మేమంతా ఉన్నామని తెలపడం జరిగిందన్నారు.