కనిగిరి: పామూరు పట్టణంలో వైభవంగా శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి ఉత్సవం, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
పామూరు పట్టణంలో కొలువైన శ్రీ గోవిందమాంబ సమేత శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, హోమాలు, విశేష పూజలు జరిగాయి. పామూరు పట్టణం తోపాటు చుట్టుపక్కల గ్రామాల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటుచేసిన ఆలయ కమిటీ నిర్వాహకులు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.