పెన్పహాడ్: పదవ తరగతి, ఇంటర్మీడిటీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు పెన్ పహాడ్ ఎస్సై గోపికృష్ణ ఘన సన్మానం
ప్రతి ఒక్కరి జీవితంలోనూ విద్యార్థి దశ చాలా కీలకమని పెన్ పహాడ్ ఎస్సై గోపికృష్ణ అన్నారు. మండల కేంద్రంలో పదవ తరగతి ఇంటర్మీడియట్ లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు సక్రమమైన పద్ధతిలో చదువుకొని ఉన్నతమైన స్థానాలను అధిరోహించాలన్నారు. యువత చెడు వ్యసనానికి దూరంగా ఉండాలని అన్నారు.