బనగానపల్లె: కొలిమిగుండ్ల మండలంలో 108 లో మహిళ ప్రసవం, మగ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం సింగవరం గ్రామానికి చెందిన శివకుమారి అనే గర్భిణి శుక్రవారం 108లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది ఆమెను అవుకు క్లస్టర్ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే నొప్పులు ఎక్కువయ్యాయి. 108 సిబ్బంది సమయస్ఫూర్తితో వాహనంలోనే సురక్షితంగా ప్రసవం చేయించగా, ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు