ఒంగోలు అర్బన్: ఒంగోలులో దళితుల హక్కులకై రౌండ్ టేబుల్ సమావేశం, క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా తొలగించడంపై ఆందోళన
Ongole Urban, Prakasam | Apr 23, 2026
ఒంగోలు పట్టణంలో దళితుల హక్కులపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎమ్మార్పీఎస్ నేత బ్రహ్మయ్య మాదిగ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరగ, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీంకోర్టు చెప్పడంపై ఇది రాజ్యాంగ విరుద్ధమైన తీర్పుని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు మేలు చేసేలా నిర్ణయాలు ఉండాలని దళితులకు అన్యాయం చేసేందుకు ఇటువంటి చర్యలు జరుగుతున్నాయని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.