ఏలూరులో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటన డంపు యార్డులలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని ఆదేశం
Eluru Urban, Eluru | Sep 17, 2025
ఏలూరులో రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణ బుధవారం పర్యటించారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, వివిధ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ముందుగా పోణంగిలోని ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలో ఘన వ్యర్ధాల నిర్వహణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, అక్టోబర్, 2వ తేదీ నాటికి డంపింగ్ యార్డ్ లో చెత్తను పూర్తిస్థాయిలో నిర్వహణ చేసి తొలగించాలన్నారు. గత ప్రభుత్వం చెత్త మీద ప్రజల నుండి పన్ను వసూలు చేసి, కనీసం చెత్తను తొలగించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి