సంగారెడ్డి: అమ్మవారి ఆగమన్ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన గంగా హారతి, తిలకించేందుకు భారీగా తరలి వచ్చిన భక్తులు
సంగారెడ్డి పట్టణంలోని బ్రాహ్మణవాడలో అమ్మవారి ఆగమన్ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. దుర్గాభవాని విగ్రహాన్ని ఊరేగింపుగా కొత్త బస్టాండ్ నుంచి బ్రాహ్మణవాడ వరకు తీసుకువచ్చారు. అనంతరం కాశీకి చెందిన వారితో గంగా హారతి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. గంగా హారతిని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.