నంద్యాల అర్బన్: నంద్యాలలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తాసిల్దార్ కు వినతి
Nandyal Urban, Nandyal | May 5, 2026
నంద్యాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.బాబా ఫక్రుద్దీన్, పట్టణ కార్యదర్శి కె. ప్రసాద్ డిమాండ్ చేశారు. నంద్యాల తహశీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్ శ్రీ వాణికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం త్వరగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, క్వింటా మద్దతు ధర రూ.2,400తో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు