ఆమనగల్: ఆమనగల్ ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలంపాట నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన సీఐ చౌహన్
రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో నలుగు మండలాలలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాల వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఆమనగల్ ఎక్సైజ్ సీఐ చౌహాన్ తెలిపారు. వాహనాలు కొనుగోలు చేయాలని ఆసక్తి కలిగిన వారు 7వ తారీకు ఉదయం పదిన్నర గంటలకు ఆమనగల్ ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించే వేలం పాటలో పాల్గొనాలని కోరారు.