నిజామాబాద్ సౌత్: పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా ఇంజనీర్ వేడుకలు పాల్గొన్న సీపీ సాయి చైతన్య
నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే ను ఘనంగా నిర్వహించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పాల్గొని పూలమాలతో మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య విద్యార్థులను రిటైర్డ్ ఇంజనీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ చాలామంది ఇంజనీర్లు ఈ దేశంలో పనిచేశారన్నారు. కానీ మనం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని ఇంజనీర్స్ డే గా ఎందుకు జరుపుకుంటున్నామో వివరించారు.