జిల్లాలో పనితీరు తక్కువగా ఉన్న పదిమంది అధికారులకు షోకాస్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 13, 2026
ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని సకాలంలో సమర్థవంతంగా పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్షమని ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలలో కనీసం 95 శాతం వరకు నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి స్పష్టం చేశారు సోమవారం కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన స్వయంగా ప్రజల నుంచి వినతుల స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లాలో ప్రజలకు బాగా సేవలందించిన పదిమంది అధికారులను గుర్తించి అభినందించారు అలాగే పని చేయని పదిమంది అధికారులకు షోకాస్ నోటీసులు జారీ చేయాలని నోడల్ అధికారిని ఆదేశించారు