నంద్యాల అర్బన్: నంద్యాలలో విషాదకర ఘటన, కొడుకుకు భారం కాకూడదని వృద్ధ దంపతుల ఆత్మహత్య
Nandyal Urban, Nandyal | Jul 14, 2026
నంద్యాలలోని సంజీవ నగర్ లో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. వృద్ధ దంపతులు అక్కిరెడ్డి, అనురాధ తమ ఇంట్లోని వేర్వేరు గదుల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఏఎస్పీ సుస్మితా ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు అక్కిరెడ్డి పోస్టుమెన్గా పనిచేసి రెండేళ్ల క్రితం పదవీ విరమణ పొందినట్లు గుర్తించారు. వృద్ధాప్యంలో కొడుకుకు భారంగా మారకూడదని ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. 5 250 చదవని వార్తలు