వరంగల్: వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద కలకలం: పోలీసు వేషంలో వచ్చిన నకిలీ వ్యక్తి అరెస్ట్
వరంగల్ భద్రకాళి ఆలయానికి పోలీసు దుస్తుల్లో వచ్చి వీఐపీ దర్శనం కోరిన శివనగర్‌కు చెందిన బండి ప్రశాంత్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అతని వద్ద నకిలీ ఐడి కార్డులు బయటపడ్డాయి. ఆలయ అధికారి ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.