కర్నూలు: వాయుగుండం నేపథ్యంలో జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలి: కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి
వాయుగుండం నేపథ్యంలో జిల్లాలో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం 12 గంటలు కర్నూలు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. రిజర్వాయర్లు,చెరువులు, లోతట్టు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, నదీతీర ప్రాంతాలను పరిశీలించి, ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా, తగిన నివారణ చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.