గుంతకల్లు: రైతులు సంరక్షణ చర్యలు తీసుకోండి: గుత్తి మండలం కరిడికొండలో పర్యటించిన అనంతపురం ప్రధాన శాస్త్రవేత్తలు
వర్షాధారం కింద సాగు చేసిన కంది, ఆముదం, సజ్జ, అవరాలు పంటలలో రైతులు సంరక్షణ చర్యలు తీసుకోవాలని అనంతపురం వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్.విజయశంకర్, శాస్త్రవేత్తలు డాక్టర్.లక్ష్మణ్, డాక్టర్. ఐ. భాస్కర్ రావు, డాక్టర్.కేసీ.నటరాజ్ సూచించారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని కరిడికొండ గ్రామంలో బుధవారం శాస్త్రవేత్తలు పర్యటించారు. వర్షాధారం కింద సాగు చేసిన పంటలను శాస్త్రవేత్తలు. గ్రామంలో అద్దెకు ఇచ్చే వ్యవసాయ పనిముట్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.