మునిపల్లి: కంకోల్ టోల్ ప్లాజా వద్ద సుమారు కిలోన్నర ఎండు గంజాయి స్వాధీనం
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి మండలం కంకోల్ జాతీయ రహదారి చెక్ పోస్ట్ వద్ద కిలోన్నర ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాజేష్ నాయక్ ఆదివారం తెలిపారు.బీదర్ నుంచి హైదరాబాద్ వైపు ద్విచక్ర వాహనంపై మహేష్ రాహుల్ వెళ్తుండగా తనిఖీల్లో పట్టుబడినట్లు తెలిపారు.నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు ఆక్రమంగా ఎవరైనా గంజాయి తరలిస్తే చర్యలు తీసుకుంటామని కేసులు పెడతామని హెచ్చరించారు.