మూసాపేట: పోల్కంపల్లి గ్రామంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కారుతో ఢీకొన్న ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి
మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం పోల్కంపల్లిలో సోమవారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న శంషోద్దీన్, షఫ్ అనే యువకులు కారు అడ్డదిడ్డంగా నడిపి ఇళ్ల ప్రహరీలు ధ్వంసం చేశారు. ఇంటికి వెళ్తున్న స్వప్న ను కారు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బాలుడు శివ తీవ్రంగా గాయపడగా, అతనిని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల ఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు