ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో రెజ్లింగ్ కుస్తీ జూడో శిక్షణ ప్రారంభించిన: జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో రెజ్లింగ్ కుస్తీ జూడో వేసవి శిక్షణ శిబిరాన్ని నంద్యాల జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ ఎం సుబ్బారెడ్డి, రెజ్లింగ్ అసోసియేషన్ సెక్రటరీ రాబర్ట్ శనివారం ప్రారంభించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆళ్లగడ్డలో రెండు సంవత్సరాల నుంచి క్రీడల్లో దినదిన అభివృద్ధి చెందుతూ క్రికెట్, హ్యాండ్ బాల్, ఫుట్ బాల్, ఫిజికల్ ఫిట్నెస్, కుస్తీ లో శిక్షణ ఇస్తున్నట్లు కోచ్ సుబ్బారాయుడు తెలిపారు