మాచారెడ్డి: మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో తనిఖీ, అనుమానితుల కదలికపై నిఘా పెట్టాలి : జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
అనుమానితుల కదలికలపై పోలీసు నిఘా ఉండాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. మాచారెడ్డి పోలీస్ స్టేషన్ను బుధవారం తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్లో రికార్డులు, రిసెప్షన్, లాకప్, మెయిన్ బ్యారక్, టెక్నికల్ రూంను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో ఎక్కువగా జరిగే నేరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తు వివరాలను ఎస్సై అనిల్ ను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ సత్వర న్యాయం చేయాలని సూచించారు. నేరాల అదుపునకు పటిష్టమైన గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. కేసుల నమోదు, రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు చేసి ఎలాంటి పెండెన్సీ లేకుండా ఉంచాలన్నారు.