పాలకొల్లు: మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ 19న నిరసన కార్యక్రమం : YCP మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ సరిత
ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పాలకొల్లు నియోజకవర్గ దగ్గులూరు గ్రామంలో ఈనెల 19వ తేదీన నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రా జయ సరిత తెలిపారు. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో గురువారం సాయంత్రం 6 గంటలకు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.