ఒంగోలు అర్బన్: భారీ చోరీ ఘటనపై ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | May 23, 2026
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఈనెల 12వ తేదీ జరిగిన భారీ చోరీ ని పోలీసులు చేదించారు. శ్రీ వెంకటేశ్వర హార్డ్వేర్ దుకాణం, యజమాని ఇంటిలో 273 గ్రాముల బంగారం కేజీకి పైగా వెండి రూ.5,95 లక్షల నగుదుని దొంగలు అపహరించారు. నిందితులను అదుపులోకి తీసుకొని చోరీకి గురైన సొత్తుని రికవరీ చేసినట్లు ఒంగోలులో ఎస్పీ హర్షవర్ధన్ రాజు శనివారం తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నామన్నారు.