ఒంగోలు అర్బన్: వైసీపీ కార్యాలయంలో పొట్టుపొట్టుగా కొట్టుకున్న వైసీపీ కార్యకర్తలు.
Ongole Urban, Prakasam | Jul 8, 2026
ఒంగోలు వైసిపి కార్యాలయంలో కార్యకర్తల మధ్య ఘర్షణ.. ముష్టి యుద్ధానికి దారితీసిన వైఎస్‌ఆర్ జయంతి కార్యక్రమం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఉద్రిక్తంగా మారాయి. పార్టీ కార్యకర్తల మధ్య నెలకొన్న వాగ్వాదం క్రమంగా ముదిరి ముష్టి యుద్ధానికి దారితీసింది. ఈ ఘటనలో వైసిపి ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రశన్నపై పార్టీకి చెందిన కార్యకర్తలు దాడి చేసినట్లు సమాచారం. అనంతరం మేరి అనే మహిళ తన భర్త శ్రీనుతో కలిసి ప్రశన్నపై దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.