విశ్వం కాలేజ్ వద్ద ఎదురు ఎదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు.
అన్నమయ్య జిల్లా. కురుబాలకోట మండలం అంగళ్లు గ్రామ సమీపంలో విశ్వం ఇంజనీరింగ్ కళాశాల వద్ద శుక్రవారం ఎదురు ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ద్విచక్ర వాహనాల్లో వెళుతున్న ముగ్గురు గాయపడ్డారు గాయపడ్డారు. వెంటనే స్థానికులు 108కు సమాచారం తెలిపి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.