నందికోట్కూరు: పెట్రోల్ డీజిల్ పెంపుకు వ్యతిరేకంగా:ట్రాక్టర్ కు తాడుకట్టి వైసీపీ వినూత్న నిరసన
పెట్రోల్,డీజిల్ పెంపునకు నిరసనగా నందికొట్కూరు పట్టణంలో ట్రాక్టర్ కు తాడు కట్టి ట్రాక్టర్ ను తాడుతో లాగుతూ వైసీపీ నందికొట్కూరు ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టింది.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో సోమవారం వైసీపీ కార్యాలయం నుండి పటేల్ సెంటర్ తహసిల్దార్ కార్యాలయం వరకు నాయకులతో కలిసి డాక్టర్ సుధీర్ ధర్నా చేపట్టారు. తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా అనంతరం తహసిల్దార్ శ్రీనివాసులుకు డాక్టర్ సుధీర్ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని చెప్పి ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ పెంచడం