ఉరవకొండ: ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలోని ఉరవకొండ బెలుగుప్ప కూడేరు వజ్రకరూర్ విడపనకల్లు మండలాల్లో సెప్టెంబర్ 15 ను పురస్కరించుకొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని నిర్వహించారు. బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీనివాస విద్యానికేతన్ పాఠశాలలో హెచ్ఎం సుమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్రాంత ఉత్తమ ఉపాధ్యాయులు పర్వతన్న తో కలసి కరస్పాండెంట్ శ్రీనివాసులు పాల్గొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.