సంతనూతలపాడు: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
సంతనూతలపాడు లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా సంతనూతలపాడు ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్ శనివారం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెలలో మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మన పట్టణాలు, పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకునే అవకాశం ఉంటుందన్నారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే సూచించారు.