నందికోట్కూరు: వేంపెంట శ్రీ సీతారామ లక్ష్మణ శిఖర ధ్వజ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ శివానందరెడ్డి
నంద్యాల జిల్లా పాములపాడు మండలం వెంపెంట గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్సమేత శిఖర ధ్వజ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి గ్రామ నాయకులు టేకురి రామసుబ్బమ్మ,టేకురి నాగేశ్వరరావు ఆహ్వానం మేరకు బుధవారం నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానంద రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు, ముందుగా గ్రామస్తులు వారికి మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు,ఈ కార్యక్రమంలో కన్వీనర్ రవీంద్రా రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ హరినాథ్ రెడ్డి, తిమ్మారెడ్డి, లక్ష్మీ కాంతారెడ్డి, మోహన్ గౌడ్, గోవిందు తదితర మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.