నారాయణపేట్: వికలాంగుల కుటుంబాలకు అంతోదయ రేషన్ కార్డులు మంజూరు చేయాలి: ఎన్పిఆర్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కే.కాశప్ప
నారాయణపేట జిల్లాలోని వికలాంగుల కుటుంబాలకు అంతో దయ రేషన్ కార్డులు మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో సోమవారము డిఎస్ఓ బాలరాజు కు మూడు గంటల సమయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎన్పిఆర్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కే.కాశప్ప మాట్లాడుతూ పేట జిల్లాల్లో దాదాపు వికలాంగుల కుటుంబాలు పదివేలకు పైగా ఉన్నారని వీరందరూ దరిద్ర రేఖ దిగువన ఉన్న వారని అన్నారు. కాబట్టి వీరందరికీ అంతోదయ కార్డులు మంజూరు చేస్తే ప్రభుత్వం నుండి వచ్చే సదుపాయాలు వీరికి లభిస్తాయని అన్నారు.