బనగానపల్లె: అవుకు పట్టణంలో ఓ ఇంట్లో బయటపడ్డ పురాతన సొరంగం
నంద్యాల జిల్లా అవుకు పట్టణంలోని కుమ్మరిదిడ్డి వీధిలో గల 45 ఏళ్ల పురాతన ఇంట్లో సొరంగం బయటపడింది. ఈడిగే వేణుగోపాల్, సరస్వతి దంపతుల ఇంటి మధ్య భాగం కుప్పకూలడంతో పది అడుగుల లోతైన రంధ్రం పడింది. లోపల ఆరడుగుల వెడల్పుతో పాటు నీటి ప్రవాహం కనిపిస్తోంది. మట్టి నుంచి నీటి ధారలు వస్తుండటంతో ఈ వింతను చూసేందుకు స్థానికులు భారీగా ఎగబడ్డారు.