ఒంగోలు అర్బన్: అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రైట్ టు లీవ్ రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు స్పీచ్ అనేదే సమానత్వానికి సూచకం : డిఆర్ఓ
Ongole Urban, Prakasam | Apr 14, 2026
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, వారిని ఆదర్శంగా తీసుకుని నేటి యువత ముందుకు పోవాలని జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు పేర్కొన్నారు.మంగళవారం డా బి ఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఫెడరేషన్ ఆఫ్ రిలియబుల్ క్యాపబుల్ ఎంప్లాయీస్ యూనియన్ వారి ఆధ్వర్యంలో ఒంగోలు లోని అంబేద్కర్ భవనం నుండి నిర్వహించిన ర్యాలీ ని జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.