చిన్నమట్లపూడి గ్రామంలో వృద్ధురాలు పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసిన రేపల్లె రూరల్ పోలీసులు
బాపట్ల నగరం మండలం చిన్నమట్లపూడి గ్రామంలో వృద్ధురాలు సుశీలమ్మపై మానభంగం చేసి, ఆమె మరణానికి కారణమైన నిందితుడు విజయ కుమార్ అలియాస్ విజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సిరిపుడి గ్రామంలోని నాగమ్మ కొట్టు సెంటర్ వద్ద విజయ్ కుమార్ ఉన్నాడన్న సమాచారంతో రేపల్లె రూరల్ సిఐ సురేష్ బాబు ఆదేశాల మేరకు ఎస్సై భార్గవ్ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రేపల్లె కోర్టులో హాజరుపరిచారు.