ఒంగోలు అర్బన్: రాజధాని అభివృద్ధి చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి నేడు వైసీపీ రౌడీ ముఖాలను పంపారు: మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | Jun 28, 2026
అమరావతి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి జగన్ అండ్ కో ఓర్వలేక పోతున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మండి పడ్డారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానుల పేరుతో గత ఐదేళ్లు అమరావతిపై విషం చిమ్మిన జగన్ అండ్ కో నేడు రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక పోతున్నారు. వైసీపీ రౌడీ మూకల్ని పంపి నిన్న రాజధానిలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నారు. వైసీపీ కుట్రల్ని అమరావతి రైతులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. వైసీపీ హయాంలో అమరావతి రైతులపై అక్రమ కేసులు, వేధింపులతో హింసించారు. నేడు ఏ మొహం పెట్టుకుని వైసీపీ నేతలు రాజధానికి వెళ్తారు అన్నారు