ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రాష్ట్రీయ రహదారులపై మిర్రర్లు ఏర్పాటుచేసిన పోలీసులు
Ongole Urban, Prakasam | Jun 5, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాష్ట్రీయ జాతీయ రహదారులపై శుక్రవారం పోలీసులు మిర్రర్లు ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో మూలమలుపుల వద్ద మిర్రర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మిర్రర్లు ఉపయోగించుకుని వాహనదారులు రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మూలమలుపులు తిరిగే క్రమంలో వాహనదారులు నెమ్మదిగా వాహనాలను నడుపుతూ తమ గమ్యస్థానానికి సురక్షితంగా వెళ్లాలని అలానే వాహనాలను గమనిస్తూ మలుపులు తిరగాలని తెలిపారు.