అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా పంపనూరు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 30, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని ఆత్మకూరు మండలం పంపనూరు వద్ద జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలైన సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. తీవ్ర గాయాల పాలైన యువకులను 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.