నడికుడి రైల్వే జంక్షన్ రోడ్డును బాగు చేయాలి : దాచేపల్లి ఇండిపెండెంట్ కౌన్సిలర్ షరీఫ్
దాచేపల్లి నుంచి నడికుడి రైల్వే జంక్షన్ కు వెళ్లే రోడ్డును వెంటనే బాగు చేయాలని నగర పంచాయతీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ షేక్ షరీఫ్ కోరారు. నాలుగు సంవత్సరాల క్రితం రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ ఇప్పటికి కూడా పూర్తి కాలేదు అన్నారు రోడ్డు మీద కంకర వేసి వదిలేయడంతో స్లిప్ అయ్యి వానదారులు కింద పడిపోతున్నరని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించాలని కోరారు.