డోన్: అర్హులైన ప్రతి ఓటర్ పేరు ఉండాలి: డోన్ ఎమ్మెల్యే కొట్లా
Dhone, Nandyal | Jun 29, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో డోన్ మండల క్లస్టర్, యూనిట్, బూత్ ఏజెంట్లతో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం చేపట్టిన SIR కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్దేశించిన గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదయ్యేలా చూడాలని తెలిపారు