గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను సీజ్ చేసిన అధికారులు .
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం ఎస్బిఐ కాలనీలో గల గ్లోబల్ మల్టీ హాస్పిటల్ నందు విశాఖకు చెందిన యమునా కు గుట్టుగా కిడ్నీ మార్పిడి చికిత్స నిర్వహిస్తుండగా యమునా మృతి చెందింది. యమునా తల్లి ఫిర్యాదు మెరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో జరిగిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. జిల్లా వైద్యాధికారిని దేవ శివమణి, ఆసుపత్రిలో తనకీలు నిర్వహించి రికార్డుల స్వాధీనం చేసుకుని తాత్కాలికంగా గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని తాత్కాలికంగా సీజ్ చేసినట్టు అధికారులు బుధవారం తెలిపారు