అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా అంతర్గంగాలో కూలీపై దూసుకెళ్లిన ట్రాక్టర్ చికిత్స పొందుతూ కూలీ మృతి
Anantapur Urban, Anantapur | Apr 26, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని కూడేరు మండలం అంతర్గంగా గ్రామంలో కూలీపైకి ట్రాక్టర్ దూసుకెల్లడంతో ఇప్పేరు గ్రామానికి చెందిన శివలింగమ్మ అనే కార్మికురాలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.