బనగానపల్లె: బనగానపల్లెలో చల్లబడిన వాతావరణం, ఓ మోస్తారు వర్షం
నంద్యాల జిల్లా బనగానపల్లెలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచి మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు సాయంత్రం కురిసిన వర్షం కొంతమేర ఉపశమనం కలిగించింది. పట్టణంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లోనూ వర్షం పడింది. అయితే రోడ్లపై ఆరబెట్టిన మొక్కజొన్న, వరి ధాన్యం తడిసిపోతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో పంటలకు నష్టం కలిగే అవకాశము ఉందని రైతులకు తెలిపారు