బనగానపల్లె: బనగానపల్లె మండలం లో వర్షాల కోసం అమ్మవారి యాత్ర
ఎల్ నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో బనగానపల్లెలోని గ్రామాల్లో వర్షాలు కురవాలని ప్రత్యేకంగా అమ్మవారి యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీరువోలు గ్రామంలో అమ్మవారి విగ్రహాన్ని గ్రామ వీధుల్లో ఊరేగించారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థనలు చేశారు.