నంద్యాల అర్బన్: ప్రభుత్వం నిబంధన ప్రకారమే బక్రీద్ జరుపుకోవాలి : నంద్యాలలో ముస్లిం మత పెద్దల తీర్మానం
Nandyal Urban, Nandyal | May 24, 2026
రాబోయే బక్రీద్ పండుగను ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రశాంతంగా జరుపుకోవాలని నంద్యాల జిల్లా ఇమాముల సంఘం, జమియేతే ఉలేమా హిందూ పిలుపునిచ్చాయి. కుబ్రా మసీదులో జరిగిన సమావేశంలో.. నమాజ్ వేళలు పాటించాలని, కుర్బానీలో పొట్టేళ్లను మాత్రమే వినియోగించాలని తీర్మానించారు. చట్టాన్ని గౌరవిస్తూ ఆవుల వధపై నిషేధాన్ని పాటించాలన్నారు. కుర్బానీ అనంతరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలన్నారు