నారాయణపూర్: రాచకొండ గుట్టల్లో బోగత జలపాతాన్ని తలపించే జలపాతాలు, ఆకర్షితులవుతున్న పర్యాటకులు
యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండలం లోని రాచకొండ గుట్టల్లో అదిలాబాద్ బోగత జలపాతాన్ని తలపించే జలపాతాలు ఉండడంతో పర్యాటకులు ఆకర్షితులై సందడి చేస్తున్నారు. హైదరాబాదుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాన్ని చూడడానికి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాల నుండి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం నారాయణపురం ఎస్ఐ జగన్ మాట్లాడుతూ.. జలపాతాలు ప్రమాదకరంగా ఉన్నాయని, కొందరు గతంలో నాచు జారీ కిందపడి ప్రాణాలు కోల్పోయారని, అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.