కొత్త హాస్టల్ భవనం నిర్మించారంటూ కే కోటపాడు మండలం కొరువాడ బీసీ హాస్టల్ విద్యార్థులు ఆందోళన
1987 సంవత్సరం నిర్మించిన ఈ హాస్టల్ భవనం శిథిలావస్థలో చేరుకొందని భయాందోళనలతో హాస్టల్ లో ఉంటున్నామని కే కోటపాడు మండలం కొరువాడ హాస్టల్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు, విద్యార్థులు ఉంటున్న హాస్టల్ కొత్త భవనం నిర్మించారంటూ శనివారం హాస్టల్ వద్ద సుమారు 70 మంది విద్యార్థులు నిరసన చేపట్టారు, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొత్త భవనం నిర్మించాలని విద్యార్థులు కోరారు.